నెల్లూరు జిల్లాలో తెదేపాకు ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత బీద మస్తాన్‌రావు రాజీనామా చేశారు. ఇవాళ తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి తాను రాజీనామా చేస్తున్నానని ఈ సందర్భంగా లేఖలో ఆయన పేర్కొన్నారు. మస్తాన్‌రావు వైకాపాలోకి వెళతారంటూ గత కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మస్తాన్‌రావు రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. శనివారం ఆయన వైకాపాలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు వైకాపాలో చేరికను మస్తాన్‌రావు ఇంకా ధ్రువీకరించలేదు.
తెదేపాకు సీనియర్ నేత బీద మస్తాన్‌రావు రాజీనామా - తెదేపాకు బీద మస్తాన్‌రావు షాక్ వార్తలు
తెదేపాకు సీనియర్ నేత బీద మస్తాన్‌రావు షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తూ అధినేత చంద్రబాబుకు లేఖ పంపారు.

Beda Mastan Rao resigns to TDP
ఇదీ చదవండి : వివేకా హత్య కేసు: మరో ముగ్గురిని విచారించిన సిట్