నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో అభం శుభం తెలియని 12 ఏళ్ల బాలికపై 66 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి ప్రయత్నించాడు. మండలంలోని పడుగుపాడు ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రామ్మూర్తి అనే వృద్ధుడు, పూల కోసం వెళ్ళిన బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం గమనించిన స్థానికులు, ఆ వృద్ధుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కోవూరు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ క్రిష్ణా రెడ్డి తెలిపారు.
12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించిన వృద్ధుడు - sexually assault on 12 years girl news update
12 ఏళ్ల బాలికపై 66 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి యత్నించిన ఘటన నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు వృద్దుడికి దేహశుద్ధి చేశారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని ఆరెస్ట్ చేసిన పోలీసులు తెలిపారు.
బాలికపై లైంగిక దాడికి యత్నించిన వృద్ధుడు
ఇవీ చూడండి...