నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని టంగుటూరి ప్రకాశం పంతులు పాఠశాలలో జన విజ్ఞాన వేదిక (జీవీవీ) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులకు తదుపరి తరగతుల పాఠ్యాంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. సెలవుల్లో విద్యార్థులకు నెలరోజుల పాటు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ తరగతులకు ఆసక్తి ఉన్న విద్యార్థులు హాజరు కావచ్చని కోరారు. ఈ కార్యక్రమంలో తదుపరి పాఠ్యాంశాలతో పాటు , సమాజంపట్ల అవగాహన, కథలు, కవిత్వం ఇతర విషయాలు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇతర పాఠశాల్లో ఈ తరగతులు కొనసాగిస్తామని జేవీవీ యూటీఎఫ్ ఉపాధ్యాయులు తెలిపారు.
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు వేసవి శిక్షణ - jana vigjnana vedika
ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పదోతరగతి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు తమ వంతు కృషి చేస్తున్నారు. వేసవి సెలవుల్లో సమయం వృథా కాకుండా ఆసక్తి గల విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. జన విజ్ఞాన వేదిక నిర్వాహకులు వారితో భాగం అయ్యారు. గణితం, ఆంగ్లం, సైన్స్ సబ్జెక్టులలో విద్యార్థుల సందేహాలు తీరుస్తున్నారు.
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన తరగతులు