ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు పౌరసరఫరాల సంస్థ కుంభకోణం.. సూళ్లూరుపేట ఆర్డీఓ అరెస్ట్​ - Civil Supplies Scam in Nellore district

SULLURUPETA RDO ARREST IN CIVIL SUPPLY SCAM : నెల్లూరు జిల్లా పౌరసరఫరాల సంస్థ కుంభకోణంలో పెద్ద వికెట్ పడింది. సూళ్లూరుపేట ఆర్డీఓ రోజ్‌మండ్‌ను ACB అరెస్టు చేసింది. కోర్టు ఆమెకు రిమాండ్‌ విధించింది. ఇప్పటికే ఈ కేసులో అనేకమంది సిబ్బంది కటకటాలపాలయ్యారు.

SULLURUPETA RDO ARREST
SULLURUPETA RDO ARREST

By

Published : Dec 22, 2022, 7:51 AM IST

SULLURPETA RDO ARREST : సంచలనం సృష్టించిన నెల్లూరు పౌరసరఫరాల సంస్థ కుంభకోణం కేసు విచారణలో కీలక ముందడుగు పడింది. ఈ అక్రమాల్లో పాత్రధారి ఆరోపణలు ఎదుర్కొంటున్న పౌరసరఫరాల సంస్థ మాజీ మేనేజర్‌, ప్రస్తుత సూళ్లూరుపేట ఆర్డీఓ రోజ్‌మండ్‌ను.. ఏసీబీ అరెస్టు చేసింది. ఆమెను సుదీర్ఘంగా ప్రశ్నించిన ఏసీబీ అధికారులు... అక్రమాల్లో పాల్పంచుకున్న మరికొందరి వివరాలు ఆమె నుంచి రాబట్టినట్లు తెలిసింది. అరెస్టు తర్వాత రోజ్‌మండ్‌ను కోర్టులో హాజరుపరచగా.... ఆమెకు రిమాండ్‌ విధించింది. రోజ్‌మండ్‌ అరెస్టుతో ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతాధికారుల పాత్ర కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగి శివకుమార్‌తో మరో 12 మంది ఇప్పటికే అరెస్టయ్యారు. వారి ఆస్తులను సీజ్ చేశారు.

నెల్లూరు జిల్లా పౌరసరఫరాల సంస్థలో 29 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఏసీబీ ప్రాథమిక నివేదికలో తేల్చింది. 2017 సంవత్సరం నుంచి అవినీతి వ్యవహారాలు సాగుతున్నట్లు గుర్తించింది. పౌరసరఫరాల సంస్థలో ముఖ్యమైన అధికారులతోపాటు.... ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములైన వారిని ఏసీబీ విచారణ చేస్తోంది. IAS అధికారుల పాత్రపైనా విచారణ చేస్తున్నారు.

నెల్లూరు పౌరసరఫరాల సంస్థ కుంభకోణం.. సూళ్లూరుపేట ఆర్డీఓ అరెస్ట్​

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details