ఆంధ్రప్రదేశ్

andhra pradesh

''డాక్టర్లే.. మా కొడుకును చంపేశారు''

By

Published : Jul 22, 2019, 7:26 AM IST

నెల్లూరు జిల్లాలో ఓ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందగా, వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.

A boy died while undergoing treatment in Nellore and family members raised concerns in front of the hospital due to negligence of doctors.

వైద్యుల నిర్లక్ష్యమే బాబు మృతికి కారణమని ఆందోళన..

నెల్లూరు జిల్లా బృందావనంలోని పద్మావతి ఆసుపత్రిలో.. అనారోగ్యంతో చేరిన పదేళ్ల బాలుడు హర్షవర్ధన్.. హఠాన్మరణం పొందాడు. తమ చిన్నారి మృతికి ఆసుపత్రి యాజమాన్యమే కారణమని బంధువులు ఆందోళన చేపట్టారు. కృష్ణపట్నంలో నివాసముండే దేవా, వసంతల కుమారుడు హర్షవర్ధన్ (10)... జ్వరంతో వారం రోజుల క్రితం పద్మావతి ఆసుపత్రిలో చేరాడు. కోలుకుంటున్న సమయంలోనే ఆకస్మాత్తుగా మృతిచెందడం కుటుంబీకుల్లో అనుమానాలు రేకెత్తించింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడని తల్లితండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. హర్ష మృతికి కారణమైన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలుని ఆరోగ్య పరిస్థితి గురించి ముందుగానే తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చామని, ప్లేట్ లెట్స్ తగ్గి, గుండె ఆగిపోవడంతో బాబు మృతిచెందాడని డాక్టర్ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details