ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'జన జాతీయ గౌరవ దినం'.. మన్యం జిల్లాలో ఉత్సవాలు

By

Published : Nov 16, 2022, 5:14 PM IST

Sports competitions: జన జాతీయ గౌరవ దినం.. గిరిజన గర్వదినం ఉత్సవాలు సందర్భంగా గిరిజన సాంస్కృతిక పరిశోధన మరియు శిక్షణ సంస్థ సౌజన్యంతో క్రీడ పోటీలు ప్రారంభమయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల మైదానంలో ఐటీడీఏ స్థాయి క్రీడా పోటీలను పురపాలక చైర్ పర్సన్ గౌరీశ్వరి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి సూర్యనారాయణ ప్రారంభించారు.

గిరిజన క్రీడా పోటీలు
గిరిజన క్రీడా పోటీలు

Sports competitions: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల మైదానంలో జిల్లా స్థాయి క్రీడా సాంస్కృతిక పోటీలు ప్రారంభమయ్యాయి జన జాతీయ గౌరవ దినం సందర్భంగా రెండు రోజులపాటు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలను జెండా ఎగురువేసి, జ్యోతి వెలిగించి పురపాలక చైర్మన్ గౌరీ, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సూర్యనారాయణ ప్రారంభించారు. అనంతరం క్రీడాకారుల మార్చ్​ఫాస్ట్ ద్వారా గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్బంగా డీడీ సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రతిరోజు క్రీడలను సాధన చేస్తే చక్కని ఆరోగ్యంతో పాటు.. పోటీతత్వం అలవడుతుందని అన్నారు. అలాగే విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఐటీడీఏ పరిధిలోని విద్యార్థులు నువ్వా నేనా తీరిలో క్రీడా పోటీలు సాగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details