FLOODS AT PARVATIPURAM : పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో కురిసిన ఆకస్మిక వర్షానికి సువర్ణముఖి నది ప్రవాహం పెరిగింది. దీంతో సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి వరద నీరు చేరడంతో ఆసుపత్రిలోని సామాగ్రి నీటిపాలైందని ఆసుపత్రి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, తంగరాజ్ ఆసుపత్రి, రామాకాలనీలకు వరద నీరు చేరడంతో చెరువులను తలపిస్తున్నాయి. వరదల ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లో కాలనీలు, గవర్నమెంట్ బిల్డింగులు నీటిలో మునిగి.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Rains: పార్వతీపురంలో వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం
RAINS AT PARVATIPURAM : పార్వతీపురంలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మామిడిపల్లి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి వరద నీరు వచ్చి చేరడంతో అందులోని సామాగ్రి నీటి పాలైంది.
RAINS AT PARVATIPURAM
జిల్లాలోని తెట్టెడు వలస వద్ద వరద చేరడంతో వాగు పొంగింది. దీంతో రాకపోకలకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు దాటాలంటే తాడు సాయంతో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇవీ చదవండి: