Pinnelli Ramakrishna Reddy Road Show: రోడ్‌షోలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం తెచ్చిన నిబంధనలు పల్నాడు జిల్లాలో అమలు కాలేదు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు రోడ్‌షోకు అనుమతించని పోలీసులు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రోడ్ షోను దగ్గరుండి మరీ నడిపించారు. మాచర్ల మండలం బైరవునిపాడులో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. మాచర్లలో ఇటీవల జరిగిన ఘర్షణల నేపథ్యంలో నియోజకవర్గంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్‌షోలు నిర్వహంచడంపై నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు వైసీపీకు వర్తించవా అని ప్రశ్నిస్తున్నారు.
పోలీసులకు కనిపించని సెక్షన్ 144, జీవో నెం.1 .. మాచర్ల ఎమ్మెల్యే భారీ రోడ్ షో
Pinnelli Ramakrishna Reddy Road Show: ప్రభుత్వం తెచ్చిన నిబంధనలను.. అధికార పార్టీ నాయకులే పాటించడం లేదు. తాజాగా మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఇది చూస్తుంటే.. ప్రభుత్వం తెచ్చిన నిబంధనలు కేవలం చంద్రబాబు రోడ్షోని అడ్డుకోవడానికేనా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే పిన్నెల్లి రోడ్ షో