Road Accident: పల్నాడు జిల్లాలో గుంటూరు-కర్నూలు జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వినుకొండ మండలం చీకటిగలపాలెం సమీపంలో సోమవారం ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం వినుకొండ నుంచి గిద్దలూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. నూజెండ్ల మండలం చెరువుకొమ్మువారిపాలెం గ్రామానికి చెందిన బొబ్బ వేణుగోపాల్ రెడ్డి అతని మనుమడు మహేందర్ (13)ను వినుకొండ తీసుకుని వస్తున్నాడు. చీకటిగలపాలెం అడ్డరోడ్డు వద్దకు రాగానే గిద్దలూరు డిపో ఆర్టీసీ బస్సు వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వేణుగోపాల్ రెడ్డి ఘటనాస్థలంలోనే మరణించగా.. గాయాలైన మహేందర్‌ను వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలిస్తుండగా మార్గంమధ్యలో మరణించాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. తాతా మనవడు మృతి
Accident: బైక్‌పై మనవడిని తీసుకుని వస్తున్నాడు తాత. చీకటిగలపాలెం అడ్డరోడ్డు వద్దకు రాగానే అనుకోని ప్రమాదం ఎదురైంది. వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను గిద్దలూరు డిపో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తాతామనవడు ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి ఇద్దరి మృతితో ఆ ఇంట్లో విషాదఛాయలు నెలకొన్నాయి.
బస్సు ప్రమాదంలో తాతామనవళ్లు మృతి