Thefts in Macharla : నలుగురు గ్యాంగ్ అపార్ట్మెంట్లోని తాళం వేసి ఉన్న ఇళ్లు లక్ష్యంగా చేసుకుని.. వాటిని పగల గొట్టేందుకు ప్రయత్నించారు. ముఖాలకు మంకీ క్యాప్ లు, చేతిలో ఇనుప రాడ్లు పట్టుకుని అపార్ట్మెంట్లోకి చొరబడ్డారు. తాళాలు రాకపోవడంతో వెనుదిరిగారు. ఈ ఘటన పల్నాడు జిల్లా మాచర్లలో జగిగింది. కాగా ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడం వల్ల అపార్టెమెంట్ వాసులు పోలీసులను ఆశ్రయించారు.
మాచర్లలో వరుస దొంగతనాలు.. బెంబేలెత్తుతున్న ప్రజలు
Thefts in Macharla : పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో దొంగలు హాల్ చల్ చేసిన సంఘటన పట్టణ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వారం రోజుల క్రితం సొసైటీ కాలనీలో ని ఓ అపార్టుమెంట్లో అర్ధరాత్రి కొందరు దొంగతనానికి పాల్పడి విఫలమయ్యారు.
దొంగతనాలు
ఇదిలా ఉండగా పట్టణంలోని ఓల్డ్ టౌన్లో సచివాలయ మహిళా కానిస్టేబుల్ ఇంట్లో చోరీ జరిగి సుమారు మూడు లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. సదరు మహిళా కానిస్టేబుల్ కుటుంబంతో కలిసి తిరుపతికి వెళ్లడంతో ఈ చోరీ జరిగింది. పట్టణంలో రాత్రివేళల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగలు చోరీకి పాల్పడుతున్నారు. దొంగలు చోరీకి యత్నించిన అపార్టుమెంట్ పక్కనే ఉన్న మరో అపార్ట్మెంట్లో ఒక సీఐ, ఎస్సై నివాసం ఉండటం గమనార్హం.
ఇవీ చదవండి: