TDP Leaders Demand YCP Govt to Pay Compensation:మిచౌంగ్ తుపానుపై ముందస్తు చర్యలు చేపట్టడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు( Yanamala Ramakrishnadu on YCP govt) ధ్వజమెత్తారు. తుపాను ప్రభావంతో లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ వదలలేదని విమర్శించారు. ప్రజలకు అవసరమైన ఆహారం, పునరావసంతో పాటు చివరకు మంచినీళ్లు కూడా సరఫరా చేయలేక చేతులెత్తేశారని మండిపడ్డారు. తుపానుపై తూతూమంత్రంగా సమీక్ష చేసి జగన్ రెడ్డి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. వరి, పొగాకు, పత్తి, మిర్చి, శనగ, అరటి, బొప్పాయి, మినుము, అపరాల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రతి రైతును ఆదుకోవడంతో పాటు బాధితులకు అండగా నిలవాలని కోరారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా పరిహారం పెంచి ఇవ్వాలని, తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
'మిగ్‌జాం' ప్రభావంతో విజయవాడ విలవిల - రాకపోకలు బంద్, ఆస్తి నష్టం
Kollu Ravindra visit submerged crops:తుపాను ప్రభావిత ప్రాంతాలైన మచిలీపట్నం, క్యాంబెల్ పేట గ్రామాల్లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. కొల్లు రవీంద్ర స్థానికులను పరామర్శించగా వారి సమస్యలను ఏకరవు పెట్టారు. రెండ్రోజులుగా గ్రామంలో కరెంటు, నీరు, తిండి లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని తెలిపారు. మత్స్యకారుల సమస్యలను కొల్లు రవీంద్ర ఫోన్ ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకెళ్లి సహాయం అందిస్తామని తెలిపారన్నారు.
Devineni Uma visit submerged crops:ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మర్సుమల్లిలో దెబ్బతిన్న వరి, మిర్చి, మెుక్కజొన్న పంటపొలాలను మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించి రైతులను పరామర్శించారు. చేతికొచ్చిన పంట నష్టపోయి రైతు కష్టంలో ఉన్నాడని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు.