TRS MLAs purchase case updates: తెలంగాణలో ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో ఇద్దరికి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నోటీసులు జారీ చేసింది. నిందితుడు నందకుమార్ భార్య చిత్రలేఖ, అంబర్‌పేటకు చెందిన న్యాయవాది ప్రతాప్ గౌడ్‌కు నోటీసులు పంపింది. ఇవాళ ఇద్దరూ విచారణకు హాజరుకావాలని సిట్ ఆదేశించింది. ఇప్పటివరకు సిట్ నోటీసులకే పరిమితం కాగా.. ప్రస్తుతం అరెస్ట్‌ల దిశగా అడుగులు వేస్తోంది. న్యాయనిపుణులతో చర్చిస్తోంది. కేరళ వైద్యుడు డా.జగ్గుస్వామి, భారతీయ ధర్మజనసేన చీఫ్ తుషార్‌లకు నోటీసులు ఇచ్చినా.. ఇప్పటివరకు సిట్ ముందు హాజరుకాలేదు.
'ఎమ్యెల్యేలకు ఎర' కేసులో మరో ఇద్దరికి నోటీసులు - ఎమ్యెల్యేలకు ఎరకేసు లేటెస్ట్ న్యూస్
TRS MLAs purchase case updates: తెలంగాణలో ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో ఇద్దరికి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఇద్దరూ విచారణకు హాజరుకావాలని సిట్ ఆదేశించింది.
తెలంగాణలో ఎమ్మెల్యేల ఎర కేసు