ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Regional Passport Office at Vijayawada: ఏపీకి మరో ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం... ఎక్కడంటే..?

విజయవాడ ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ప్రాంతీయ పాస్ పోర్టు అధికారి శివహర్ష వెల్లడించారు. బందర్ రోడ్డులోని ఏజీ కార్యాలయం భవనంలోనే విజయవాడ ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. 2024 జనవరి లోగా పోర్టు కార్యాలయం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

regional_passport_office
regional_passport_office

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 28, 2023, 9:15 PM IST

Regional Passport Office at Vijayawada: విదేశాలకు వెళ్లాలంటే పాస్ పోర్టు తప్పని సరి... కానీ, పాస్ పోర్టు కార్యాలయంలో పని అంటే ప్రజలు రోజుల తరబడి వేచిచూడాల్సి పరిస్థితిలు నెలకొనేవి. అందుకోసమే... రాష్ట్రం విడిపోయిన అనంతరం విశాఖలో పూర్తి స్థాయి పాస్ పోర్టు కేంద్రం ఏర్పాటు చేశారు. దానికి అనుబంధంగా... విజయవాడ, తిరుపతిలో పాస్ పోర్టు సేవాకేంద్రాలు నెలకొల్పారు. అయితే, రద్దీ రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో... అందుకు తగ్గట్టుగా సేవలు ఉండటం లేదంటూ... గత కొంత కాలంగా విమర్శలు వ్యక్తం అవుతున్న తరుణంలో... విదేశాంగశాఖ ఆదేశాల విజయవాడలోప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ప్రాంతీయ పాస్ పోర్టు అధికారి శివహర్ష వెల్లడించారు.

పాస్​పోర్ట్ లేకున్నా ఓసీఐ కార్డ్​ హోల్డర్లకు ఎంట్రీ!

విజయవాడ నగరంలోని కొత్త ప్రాంగణంలో... ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం ఏర్పాటు కాబోతోంది. విదేశాంగశాఖ ఆదేశాల మేరకు కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు... ప్రాంతీయ పాస్ పోర్టు అధికారి శివహర్ష స్పష్టం చేశారు. బందర్ రోడ్డులోని ఏజీ కార్యాలయం భవనంలో కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. 2024 జనవరి లోగా పోర్టు కార్యాలయం ఏర్పాటు చేస్తామని శివహర్ష స్పష్టం చేశారు. ఇక నుంచి పాస్ పోర్టు దరఖాస్తుల తనిఖీ, ప్రింటింగ్, జారీ లాంటి ప్రక్రియలన్నీ విజయవాడ ఆర్పీఓ ద్వారానే జరుగుతాయని అన్నారు.

నకిలి పాస్​పోర్టు కేసు.. నలుగురు బంగ్లాదేశీయులకు జైలు శిక్ష

ప్రస్తుతం విజయవాడ ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం ద్వారా రోజుకు 2 వేల దరఖాస్తుల ప్రాసెసింగ్ జరుగుతోందని చెప్పారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ పాస్ పోర్టు దరఖాస్తులు, పోలీసు క్రియరెన్సు సర్టిఫికేట్ల లాంటి వాటితో కలిపి 3 లక్షల దరఖాస్తులను ప్రాసెస్ చేశామని వెల్లడించారు. ప్రస్తుతం పాస్ పోర్టు తో పాటు వివిధ సేవల కోసం టైమ్ స్లాట్లు అందుబాటులోనే ఉన్నాయన్నారు. పాస్ పోర్టు జారీకి సంబంధించిన వివిధ ప్రక్రియల్లో టైమ్ స్లాట్ల అందుబాటు సమయాన్ని ఇంకా తగ్గించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఏపీలోని 13 పోస్ట్ ఆఫీస్ పాస్ పోర్టు సేవా కేంద్రాలతో పాటు తిరుపతి సహా వేర్వేరు ప్రాంతాల్లో పీఎస్ కేలు వేగంగానే దరఖాస్తులను తీసుకుంటున్నాయని ఆయన వెల్లడించారు.

విశాఖపట్నంలోని పాస్ ​పోర్టు కార్యాలయానికి అనుసంధానంగా.. ఇప్పటికే విజయవాడ, తిరుపతిలో పాస్​ పోర్టు సేవా కేంద్రాలు పని చేస్తున్నాయి. అయితే, ఆయా కేంద్రాల్లో రద్దిని దృష్టిలో పెట్టుకొని విజయవాడలో రీజనల్ పాస్​ పోర్టు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాం. మరో రెండు మూడు నెలల్లో పాస్ పోర్టు కార్యాలయం ఏర్పాటు చేస్తాం. ఈ కార్యాలయం ద్వారా పాస్​ పోర్టు సేవలు సులభతరం అవుతాయి. తక్కువ సమయంలోనే పాస్ పోర్టు సేవలు అందజేసేందుకు కృషి చేస్తాం. దయచేసి ఎవరూఫేక్ సైట్లు, బ్రోకర్లను నమ్మకండి. శివహర్ష, ప్రాంతీయ పాస్ పోర్టు అధికారి

How to Check Passport Status in Online : పాస్​పోర్ట్ స్టేటస్ ఎంతదాకా వచ్చింది.. మొబైల్​లో ఈజీగా చెక్ చేయండిలా..!

ABOUT THE AUTHOR

...view details