No Special Status To AP: రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కి ఎంత మేరకు ఆర్థిక నష్టం జరిగిందో చెప్పే రికార్డులు తమ వద్ద లేవని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. అదే సందర్బంలో.. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా లేనట్లేనని మరోసారి పరోక్షంగా తేల్చి చెప్పింది. లోక్‌సభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాలను వెల్లడించారు.
ఏపీకి ఏ మేరకు ఆర్థిక నష్టం జరిగిందో తెలియదు: కేెంద్రం - Central cooments on Ap special status
No Special Status To AP: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా లేనట్లేనని మరోసారి పరోక్షంగా తేల్చి చెప్పింది. లోక్‌సభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కి ఎంత మేరకు ఆర్థిక నష్టం జరిగిందో చెప్పే రికార్డులు ఏమీ తమ వద్ద లేవని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది.
14, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తున్నారని తెలిపిన నిత్యానందరాయ్.. ప్రత్యేక హోదా కేటాయించాలని పలు రాష్ట్రాల నుంచి డిమాండ్లు ఉన్నాయని, వాటిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి అని వెల్లడించారు. 14వ ఆర్థిక సంఘం జనరల్ కేటగిరీ రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీకి ఎలాంటి వ్యత్యాసం చూపలేదన్న కేంద్రం... ఆ తర్వాత వచ్చిన 15వ ఆర్థిక సంఘం కూడ ఈ విషయంలో ఎలాంటి ప్రత్యేక ప్రస్తావన చేయలేదని స్పష్టం చేసింది. అంతేకాక.. 15వ ఆర్థిక సంఘం సిఫారసుతో కేంద్ర పనుల్లో 41 శాతం వాటా రాష్ట్రాలకు ఇస్తున్నట్లు సమాధానంలో వెల్లడించింది. పన్నుల పంపిణీ ద్వారా... రెవెన్యూ లోటు భర్తీ చేస్తున్నట్లు బదులిచ్చిన కేంద్రం... నిధుల పంపిణీ ద్వారా వీలైనంత మేరకు ప్రతి రాష్ట్రానికి వనరులు అందించే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి: