ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివేకా హత్యకేసులో అవినాష్​ రెడ్డి, భాస్కర్​ రెడ్డిల అరెస్టు అనివార్యం: ఎంపీ రఘురామ

MP Raghuramaraju : వివేకా హత్య కేసులో అవినాష్​ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్​ రెడ్డిల అరెస్టు అనివార్యమని నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణరాజు అన్నారు. అంతేకాకుండా.. ఊహాజనిత కథనాలకు కోర్టులు ప్రభావితం కావని పేర్కొన్నారు. మా నాయకుడ్ని అరెస్టు చేస్తున్నారని వైసీపీ కార్యకర్తలు తిరగబడితే.. ముఖ్యమంత్రిపై ఉన్న కేసులు విచారణకు ముందుకు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

By

Published : Mar 7, 2023, 10:34 AM IST

Etv Bharat
Etv Bharat

MP Raghuramakrishana Raju : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిల అరెస్టు తప్పనిసరని.. ఎంపీ రాఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అరెస్టు కచ్చితంగా జరుగుతుందని ఈ సమాచరం తనకు ఓ పోలీసు అధికారి తెలిపినట్లు ఆయన వెల్లడించారు. ఒకవేళ ఎంపీ వైఎస్​ అవినాష్​ రెడ్డి, భాస్కర్​ రెడ్డిల అరెస్టు చేయకపోతే.. న్యాయస్థానంలో సీబీఐ పలు సమస్యలను ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. వారిని అరెస్టు చెయకుండా సీబీఐ ఉండిపోతే అప్రతిష్ట పాలయ్యే ప్రమాదం ఉందని.. ఆ పోలీసు అధికారి ఆందోళన వ్యక్తం చేసినట్లు వివరించారు.

ఊహాజనిత కథనాలకు కోర్టులు ప్రభావితం కావు :సీబీఐ ఛార్జ్‌షీట్​లో పేర్కొన్న అంశాలే చెల్లుబాటు అవుతాయి తప్ప.. వారి పత్రికలలో రాసే ఊహాజనిత కథనాలకు కోర్టులు ప్రభావితం కావని అన్నారు. అవినాష్​ రెడ్డి, భాస్కర్ రెడ్డిల అరెస్టుల నిరసిస్తూ తిరగబడాలని వైసీపీ కార్యకర్తలు ప్రయత్నిస్తే.. ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డిపై నమోదు చేసిన కేసులు వేగం పుంజుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం తీరికలేని కార్యక్రామలతో విచారణకు హాజరుకాలేనని సీబీఐకి అవినాష్​ రెడ్డి చెప్తున్నాడని.. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తరువాత విచారణకు హాజరవుతానని చెప్పే అవకాశాలు లేకపోలేదని అనుమానం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ సలహాదారులపై శ్వేత పత్రానికి డిమాండ్​ :ప్రభుత్వం నియమించిన సలహాదారులు ఇచ్చిన సలహాల వల్ల.. ప్రభుత్వానికి కల్గిన లాభం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారులు గత నాలుగు ఏళ్లుగా ప్రభుత్వానికి ఎన్ని సలహాలను ఇచ్చారో తెలపలన్నారు. వాటిలో ప్రభుత్వం ఎన్నింటిని అమలు చేసిందో వివరించాలని కోరారు. సలహాదారులు ఇచ్చిన సలహాల వల్ల రాష్ట్రానికి చేకూరిన ప్రయోజనలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయించాలనే నీచ మనస్తత్వం తమ పార్టీ వారికి మాత్రమే ఉంటుందని దుయ్యబట్టారు.

ఒక్క అవకాశమని మళ్లీ అబద్దాలను ప్రజలు నమ్మారు : ఒక్క అవకాశం అంటే నమ్మి అవకాశం ఇచ్చిన ప్రజలు.. మళ్లీ మళ్లీ అబద్దాలు చెప్తే నమ్మే పరిస్థితిలో లేరన్నారు. పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ఇస్తామని అంటున్న భూములను ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారని ప్రశ్నించారు. అంతేకాకుండా విద్యుత్ పెట్టుబడుల సాధ్యాసాధ్యాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. లాకప్ చిత్రహింసలపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి హైకోర్టును ఆశ్రయించాలని రఘురామ సూచించారు.

"ప్రస్తుతం విచారణ చేపడుతోంది సీబీఐ కాబట్టి, సీబీఐ ఇచ్చిన ఛార్జ్​షీట్​లోని అంశాలే చెల్లుబాటు అవుతాయి. అరెస్టు అనేది అనివార్యం మాకు అసలు సంబంధం లేదు మేము తిరగబడతామని పిచ్చి వేషాలు వేస్తే మన నాయకుడి మీద కూడా సీబీఐ కేసులు ఉన్నాయి. అవి వేగవంతమై అసలుకే ప్రమాదం ఉంది." - ఎంపీ రాఘరామకృష్ణ రాజు

ఎంపీ రాఘరామకృష్ణ రాజు

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details