Lack of Basic Facilities in AP Govt Hostels: వసతి గృహాల్లో సంక్షేమంపై ప్రభుత్వం ఎన్నో హామీలిస్తున్నా వాటి దుస్థితి మారడం లేదు. మౌలిక సదుపాయాల కొరత వసతి గృహాలను పట్టిపీడిస్తోంది. చలికాలంలోనూ.. విద్యార్థులు నేలపైనే పడుకోవాల్సిన పరిస్థితి. విద్యార్థులకు కనీసం బెడ్స్ సదుపాయం కూడా లేకపోవడంపై.. ఇటీవల హైకోర్టు ఆగ్రహించిన నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలోని వసతిగృహాల దుస్థితిపై కథనం.
ఎన్టీఆర్ జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాలు నిర్లక్ష్యానికి నిలువెత్తు దర్పణాలుగా నిలుస్తున్నాయి. వీటి సంక్షేమానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నా.. ఆచరణలో పరిస్థితి విరుద్ధంగా ఉంది. చాలా హాస్టళ్లలో పరిస్థితి దయనీయంగా ఉంది. కనీస సదుపాయాలు కొరవడ్డాయి.
కొన్ని హాస్టళ్లకు బెడ్స్ కేటాయించినప్పటికీ.. నేటికీ విద్యార్థులు నేలపై నిద్రించాల్సిన దుస్థితి కొనసాగుతోంది. నిత్యావసర ధరలు కొండెక్కి కూర్చున్న తరుణంలో విద్యార్థులకు ఇచ్చే మెనూ ఛార్జీలు ఎటూ చాలటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వసతిగృహాల్లో చాలాచోట్ల 'నాడు-నేడు' పనులు జరగడం లేదు. శిథిలావస్థకు చేరిన భవనాల్లోనే విద్యార్థులు చాలాచోట్ల తలదాచుకుంటున్నారు.
"జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాలు నిర్లక్ష్యానికి నిలువెత్తు దర్పణాలుగా నిలుస్తున్నాయి. వీటి సంక్షేమానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నా.. ఆచరణలో పరిస్థితి విరుద్ధంగా ఉంది. చాలా హాస్టళ్లలో పరిస్థితి దయనీయంగా ఉంది. కనీస సదుపాయాలు కొరవడ్డాయి. కొన్ని హాస్టళ్లకు బెడ్స్ కేటాయించినప్పటికీ.. నేటికీ విద్యార్థులు నేలపై నిద్రించాల్సిన దుస్థితి కొనసాగుతోంది. నిత్యావసర ధరలు కొండెక్కి కూర్చున్న తరుణంలో విద్యార్థులకు ఇచ్చే మెనూ ఛార్జీలు ఎటూ చాలటం లేదు. శిథిలావస్థకు చేరిన భవనాల్లోనే విద్యార్థులు తలదాచుకుంటున్నారు." - వెంకటేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి