Pawan Kalyan సినిమాల్లో నటించేది తన జీవితం కోసమేనని.. రాజకీయాలు మాత్రం దేశం, జాతి కోసమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ విద్యార్థుల సమావేశంలో పవన్‌కల్యాణ్ వాఖ్యనించారు. ‘ప్రస్తుతం రాజకీయంగా పరాజయం పొందిన వ్యక్తిగానే భావిస్తానని అన్నారు. కానీ ఎప్పటికీ ఓడిపోయిన వ్యక్తిని కానని.. అపజయం కూడా సగం విజయమే అనుకుంటానన్నారు. నేను కనీసం ప్రయత్నం చేశానని.. జయాపజయాలను సమానంగా స్వీకరించాలని తెలిపారు. నేను కోరుకున్నది సినిమా కాదని.. ఆలోచనలు, ఆశయాలు వేరే ఉన్నాయని వెల్లడించారు. ఎవరికి వారే రోల్‌మోడల్‌గా ఎదగాలన్నారు. ధనార్జనే ధ్యేయంగా కాకుండా అందరికీ గుర్తుండిపోయేలా జీవితాన్ని కొనసాగించాలని సూచించారు. ప్రతికూల పరిస్థితులే మరింత బలంగా మారుస్తాయని.. కఠిన పరిస్థితులే మరింత రాటుదేలేలా చేస్తాయని మరవద్దని హితబోధ చేశారు.
ఇప్పటికి విఫల నేతనే.. ఎప్పటికీ కాదు: పవన్ కల్యాణ్
Pawan Kalyan సినిమాలు తన జీవితం కోసమని.. రాజకీయాలు దేశం కోసమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. తాను రాజకీయంగా అపజయం పొందిన వ్యక్తిగా భావిస్తానని ఆయన అన్నారు. జయాపజయాలను సమానంగా స్వీకరించాలని సీఏ విద్యార్థులకు సూచించారు. హైదరాబాద్‌లో ఐసీఏఐ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల సమావేశంలో ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
కఠిన పరిస్థితులే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేలా తయారు చేస్తాయని విద్యార్థులకు తెలిపారు. "విజయం కోసం ఎదురుచూసే వ్యక్తులు తప్పకుండా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను అధిగమించాలి. చాలామంది జనాలకు తక్షణ విజయాలు కావాలి. మార్పు ఒక్క రోజులో రాదని తెలుసుకోవాలి. అందుకు ఓపిక, సహనం ఉండాలి. ప్రస్తుతం నా మిషన్ యువతను శక్తిమంతులుగా తీర్చిదిద్దడమే. కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థను తిట్టుకుంటూ గడిపే బదులు, దీన్ని మార్చేందుకు ఏదో ఒక ప్రయత్నం చేయడమే నా లక్ష్యం. నేను ఎప్పుడూ ఆదాయం సమకూర్చుకునే జీవితాన్ని కోరుకోను. అనుభూతితో కూడిన జీవితాన్ని కోరుకుంటాను. విజయం సాధించే మనిషిగా ఉంటావా, విలువలు కాపాడే వ్యక్తిగా ఉంటావా అని ఎవరైనా అడిగితే రెండూ కోరుకుంటా అని చెబుతాను. నా మొదటి సినిమా అపజయం తర్వాత నిరుత్సాహపడలేదు. నా విజయాల గ్రాఫ్ ఏడో సినిమా తర్వాతే పెరిగింది. మీరు 1.5 బిలియన్ల ప్రజలతో పోటీపడాలి కాబట్టి ముందుకొచ్చిన ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకోవాలి. నేను జీవితంలో ఆరేడేళ్ల పాటు అపజయాలే చూశాను. ఆ తర్వాతే విజయం వచ్చింది." అని పవన్ కల్యాణ్ అన్నారు.’’
ఇవీ చదవండి: