VARMA TWEET ON NAGABABU : వివాదాస్పద చిత్రాలు, కామెంట్లకు కేరాఫ్ అడ్రస్ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఆయనకు సంబంధించిన వీడియోలు, ట్విటర్‌లో పోస్టులు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్ అవుతాయి. ఎదో ఒక వీడియో పెట్టి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతారు. తాజాగా జనసేన లీడర్, సినీనటుడు నాగబాబును ఉద్దేశించి పెట్టిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోకి "హలో పవన్ కల్యాణ్ గారు, కొంచెం మీ భాయిజాన్‌ను చూసుకోండి" అంటూ క్యాప్షన్ పెట్టి పోస్టు పెట్టారు. ఇంతకీ ఆయన వీడియోలో ఏమన్నారంటే..
అది అర్థం కాకపోవడం నా దురదృష్టం.. ట్విటర్‌లో ఆర్జీవీ - పవన్‌పై రామ్‌గోపాల్ వర్మ ట్వీట్
RGV TWEET ON NAGABABU: ఇటీవల తాను జనసేన, పవన్‌కల్యాణ్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్లు పవన్ అభిమానిగా చేశానని సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ అన్నారు. ఈ మేరకు ఓ వీడియోను తన ట్విటర్‌లో పంచుకున్నారు. ఆ ట్వీట్లు అర్థం చేసుకోకపోవటం తన దురదృష్టమని, అంతకన్నా పవన్‌కల్యాణ్ దురదృష్టమన్నారు.
VARMA TWEET ON NAGABABU
"కొణిదెల నాగబాబు గారు.. ఆయన తమ్ముడికి, ఆయన అన్నయ్యకు ఇంపార్టెంట్ అయ్యుండొచ్చు. కానీ నాకు కాదు. నేను జనసేన, పవన్ కల్యాణ్ మీద చేసిన ట్వీట్లు కేవలం పవన్‌కల్యాణ్ అభిమానిగా మాత్రమే చేశాను. అది అర్థం అవ్వకపోవడం నా దురదృష్టం, నా కన్నా ఎక్కువ పవన్ కల్యాణ్ దురదృష్టం. ఎందుకంటే కేవలం తన అన్నయ్య కాబట్టి ఇలా సలహాదారులుగా పెట్టుకుంటే దాని తర్వాత పవన్‌కల్యాణ్ అవుట్‌కమ్ ఏంటో ప్రజలే తెలుపుతారు" అని ఆర్జీవీ ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి: