ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరెంట్ కనెక్షన్ కట్ చేస్తామంటూ.. రూ.28 లక్షలు ఖాళీ - కరెంట్ బిల్‌ సైబర్ క్రైమ్స్

Cyber crime in Hyderabad today : కరెంట్ బిల్లు కట్టనందుకు రాత్రిపూట కరెంట్ కట్ చేస్తామని ఓ మహిళ మొబైల్‌కు మెసేజ్ పంపారు. ఇదేంటి కరెంట్ కట్ చేయడమేంటి.. అని ఆమె ఆ నంబర్‌కు కాల్ చేసింది. బిల్‌ అప్డేట్ కావాలంటే మీ కంప్యూటర్‌లో ఎనీ డెస్క్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నాడు అవతలి వ్యక్తి. అతడు చెప్పినట్టే చేసిన ఆమె క్షణాల్లో తన ఖాతా నుంచి రూ.లక్షలు మాయం కావడం చూసి అవాక్కయింది.

Cyber crime
సైబర్ నేరాలు

By

Published : Dec 2, 2022, 4:54 PM IST

Cyber crime in Hyderabad today : ‘విద్యుత్తు బిల్లు చెల్లించని కారణంగా రాత్రి విద్యుత్తు సరఫరా నిలిపివేస్తాం’ అని సందేశాన్ని పంపించి రూ.28 లక్షలు కొట్టేశారని 60 ఏళ్ల వయోధికురాలు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ కథనం ప్రకారం..హిమాయత్‌నగర్‌కు చెందిన వృద్ధురాలి(60) చరవాణికి ‘కరెంట్‌ బిల్లు కట్టకపోవడంతో ఈరోజు రాత్రి 9:30 గంటలకు మీ ఇంటికి విద్యుత్తు సరఫరా నిలిపివేస్తాం’ అని ఓ సందేశం వచ్చింది.

బాధితురాలు ఆ నంబర్‌కు ఫోన్‌ చేయగా బిల్‌ అప్‌డేట్‌ కావాలంటే ‘ఎనీ డెస్క్‌’ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నాడు. డెబిట్‌ కార్డుతో రూ.10 కట్టమన్నాడు. బాధితురాలు ఆ యాప్‌లో పొందుపరిచిన కార్డు వివరాలన్నీ మోసగాడు తెలుసుకొని. ఖాతాలో ఉన్న రూ.8 లక్షలతోపాటు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రూపంలో ఉన్న రూ.20 లక్షలను ఓటీపీల ద్వారా బ్రేక్‌ చేసి మొత్తం రూ.28 లక్షలు లాగేశాడు. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details