- బాపట్లలో గుర్తుతెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి.. రోడ్డుపై బంధువుల ఆందోళన
ROAD ACCIDENT IN BAPATLA: బాపట్ల జిల్లాలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి చెందాడు. డేగరమూడి - రాజుపాలెం కూడలిలో రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అండర్‌పాస్ నిర్మించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- కొండలను తవ్వేస్తున్న అక్రమార్కులు.. రాయదుర్గంలో మట్టిమాఫియా
YCP Leaders Illegal Moving of Soil: దోపిడీకి కాదేదీ అనర్హం అన్నట్లుంది వైసీపీ నాయకుల తీరు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో కొండలను పిండి చేస్తున్నారు. అంతటితో ఆగకుండా.. కాలువ గట్లను కొల్లగొడుతున్నారు. జేసీబీలు, లారీలతో అక్రమంగా మట్టి తరలిస్తూ జేబులు నింపుకొంటున్నారు.
- ఇద్దరు పిల్లలను ఆనకట్టపై ఉంచి.. జలాశయంలోకి దూకిన దంపతులు
Couple Suicide: ఆర్థిక ఇబ్బందులు తాళలేక భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మహత్యకు యత్నించారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా.. వారిని ఆనకట్టపై ఉంచి.. దంపతులు ఇద్దరూ జలాశయంలో దూకారు. ఈ ఘటన వైఎస్ఆర్ జిల్లా మైలవరం మండలంలో చోటుచేసుకుంది. భార్య మృతదేహం దొరకగా.. భర్త కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
- రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం.. మాచర్ల ఘటనే నిదర్శనం : ఐవైఆర్ కృష్ణారావు
IYR Comments: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని.. భాజపా నేత, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు విమర్శించారు. అందుకు ఇటీవల జరిగిన మాచర్ల హింసే నిదర్శనమన్నారు. ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్న పాలకులే ఇలాంటి పరిస్థితులకు కారణమన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేసుకోకుండా అన్నీ పంచిపెడతామంటే రాష్ట్ర భవిష్యత్ ప్రమాదంలో పడినట్లేనని హెచ్చరించారు.
- మహాత్మా గాంధీ సహా మాజీ ప్రధానులకు రాహుల్ గాంధీ నివాళి
భారత్ జోడో యాత్రకు రాహుల్ గాంధీ స్వల్ప విరామం తీసుకున్నారు. దిల్లీ చేరుకున్న ఆయన సోమవారం ఉదయం మహాత్మా గాంధీ సహా పలువురు మాజీ ప్రధానులకు నివాళులు అర్పించారు. జనవరి 3న తిరిగి భారత్ జోడో యాత్ర ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. భాజపా నేత, మాజీ ప్రధాని వాజ్‌పేయీకి కూడా రాహుల్‌గాంధీ నివాళులర్పించారు.
- సరిహద్దులో పాక్ డ్రోన్ కూల్చివేత.. వారం రోజుల్లో మూడోసారి..
పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్.. భారత్ గగనతలంలోకి ప్రవేశించడం కలకలం రేపింది. పంజాబ్ అమృత్సర్ జిల్లాలో చక్కర్లు కొడుతున్న పాక్ డ్రోన్‌పై బీఎస్ఎఫ్ కూల్చివేసింది. అనంతరం ఆ డ్రోన్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
- తైవాన్‌పై చైనా దూకుడు.. 71 యుద్ధ విమానాలను పంపిన డ్రాగన్
తైవాన్‌కు అమెరికా మద్దతుగా నిలిస్తున్నందున చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. చైనా తమ గగన తలంలోకి 71 యుద్ధ విమానాలను పంపిందని తైవాన్ ఆరోపించింది.
- ICICI బ్యాంక్ కేసులో వీడియోకాన్ ఛైర్మన్ అరెస్ట్
ఐసీఐసీఐ బ్యాంక్ రుణ మోసం కేసులో వీడియోకాన్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ దూత్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది.
- జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌గా నిఖత్
తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి తన సత్తా నిరూపించింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ వేదికగా జరుగుతున్న జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తన ప్రత్యర్థి అనామికపై 4-1 తేడాతో నిఖత్ జరీన్ విజయం సాధించి విజేతగా నిలిచింది.
- అంత క్యూట్‌గా ఉండే మహేశ్ అన్న కూతురు సోషల్‌మీడియాలో ఎందుకంత సైలెంటో
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మహేశ్ బాబుతో పాటు ఆయన పెద్ద కుమారుడు రమేశ్ బాబు కూడా హీరోగా పరిచయం అయ్యారు. పలు సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయిలో స్టార్‌డమ్‌ను తెచ్చుకోలేకపోయారు. ఆ తర్వాత నిర్మాతగా మారి చిత్రాలను నిర్మించారు. ఇకపోతే ఇప్పటికే మహేశ్ వారసులుగా సితార, గౌతమ్ ఆడియెన్స్‌లో సోషల్‌మీడియా ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. కానీ చాలా మందికి రమేశ్ పిల్లలు ఎవరో తెలీదు.