ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 26, 2023, 7:39 PM IST

ETV Bharat / state

ఉపాధ్యాయులను స్టేషన్​లో ఉంచాలని ఉత్తర్వులు.. ఎస్టీయూ నాయకుల ఆగ్రహం

STU Leaders Reaction: పదో తరగతి పరీక్ష సమయాల్లో కొందరు ఉపాధ్యాయులను పోలీసుస్టేషన్‌లో ఉంచాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడాన్ని ఎస్టీయూ నాయకులు ఖండించారు. ఉపాధ్యాయులను అవమానపరిచే ఈ ఉత్తర్వులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

STU Leaders
ఎస్టీయూ నాయకులు

STU Leaders Reaction on Orders of the Higher Authorities: పదో తరగతి పరీక్షల్లో గత ఏడాది నంద్యాల జిల్లాలో జరిగిన మాల్​ప్రాక్టీస్ వ్యవహారంలో కొంతమంది ఉపాధ్యాయులపై విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల నిర్వహణ క్రమంలో వారిని పోలీసు స్టేషన్​లో ఉంచాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ఉపాధ్యాయ సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లెలోని పదో తరగతి సమయంలో.. పరీక్షా కేంద్రంలో గత ఏడాది మాల్ ప్రాక్టీస్ జరిగింది. ఈ వ్యహారంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాత్ర ఉన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. తాజాగా ఈసారి కూడా ఉపాధ్యాయులను పోలీసు స్టేషన్లో ఉంచాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు.

ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అధికారులు ఇలాంటి చర్యలు తీసుకోవడం సరికాదని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదో తరగతి పరీక్ష సమయాల్లో కొందరు ఉపాధ్యాయులను పోలీస్ స్టేషన్‌లో ఉంచాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడం చాలా దారుణమని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆజం బేగ్‌, మౌలాలి ఖండించారు. స్థానిక ఎస్టీయూ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీటింగ్​లో వారు మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర సహాయ అధ్యక్షుడు చంద్రశేఖర్‌, ఉపాధ్యాక్షుడు గోపాలకృష్ణ, మాజీ ఉపాధ్యక్షుడు సుబ్బరాయుడు, కార్యాలయం ఇన్‌ఛార్జి సుబ్బయ్య, నంద్యాల మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఉపాధ్యాయులను అవమానపరిచే ఈ ఉత్తర్వులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

జిల్లా ఎస్పీ చెప్పిన ఆదేశాల మేరకు.. ఉపాధ్యాయులను పరీక్ష సమయంలో మూడు గంటలు స్టేషన్లో పెట్టాలనే నిర్ణయం తీసుకున్నట్లు నంద్యాల డీఈవో తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. దీనిపై ఉపాధ్యాయులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీఈవో అనురాధ చెప్పారు.

ఉపాధ్యాయులను స్టేషన్​లో ఉంచాలని ఉత్తర్వులు.. ఎస్టీయూ నాయకుల ఆగ్రహం

"ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వుల్లో.. 10వ తరగతి పరీక్షల సమయంలో.. గతంలో మాల్​ప్రాక్టీస్ వ్యవహారంలో కొంత మంది ఉపాధ్యాయులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కాగా ప్రస్తుతం పదో తరగతి పరీక్షల నేపథ్యంలో.. పరీక్షా కాలమంతా పోలీసు స్టేషన్లో రిపోర్ట్ చేయాలని నిబంధనలు ఇవ్వడం చాలా దారుణం. దీనిని మేము ఖండిస్తున్నాము. ఈ ఉత్తర్వులను ప్రభుత్వం సవరించుకోవాలి". - చంద్రశేఖర్, రాష్ట్ర సహాయ అధ్యక్షుడు, ఎస్టీయూ

"10వ తరగతి పరీక్షలు జరిగే సమయంలో.. గతంలో మాల్​ప్రాక్టీస్ కింద సస్పెండ్ అయిన ఉపాధ్యాయులను.. మళ్లీ పోలీస్ స్టేషన్​లో ఉంచేందుకు ఉత్తర్వులు ఇవ్వడం చాలా అన్యాయం. ఇప్పటికే వాళ్లు మానసిక వేదనకు గురవుతున్నారు. వారి ఆవేదనని అర్థం చేసుకోవాలి". - గోపాలకృష్ణ, ఎస్టీయూ నాయకులు, నంద్యాల

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details