కర్నూలులో రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని కొత్తపేటకు చెందిన నికిల్ కుమార్(22).. కర్నూలు సమీపంలోని పంచలింగాల వద్ద రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అయ్యిండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇంటర్ వరకు చదువుకున్న నికిల్ కుమార్ ప్రైవేటు ప్రింటింగ్ ప్రెస్లో పని చేసేవాడు. రైలు పట్టాలపై మృతదేహం గుర్తించిన కీమెన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.