ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చెడిపోయిన రోడ్ల గురించి మాట్లాడినందుకు దాడి చేశారు' - ఆదోని తాజా వార్తలు

చిన్న కారణానికే వైకాపా నాయకులు తనపై దాడి చేశారని కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ ఆటో డ్రైవర్ ఆరోపించాడు. ఆరుగురు కలిసి విచక్షణారహితంగా తనను కొట్టారని చెప్పాడు.

attack on auto driver
attack on auto driver

By

Published : Nov 5, 2020, 6:32 PM IST

బాధితుడు

పాడైపోయిన రోడ్ల గురించి మాట్లాడినందుకు తనపై వైకాపా నాయకులు దాడి చేశారని ఆటో డ్రైవర్​ రవి అనే వ్యక్తి ఆరోపించాడు. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గురువారం కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో తిమ్మారెడ్డి బస్ స్టాండ్ వైపు వైకాపా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వెళ్తున్న సమయంలో.... రహదారుల గురించి వేరే వ్యక్తితో రవి చర్చించాడు. పక్కనే ఉన్న వైకాపా కార్యకర్త ఆ మాటలను విని పార్టీ నాయకులకు తెలిపాడు.

రవి, పక్కనే ఉన్న వ్యక్తిని ఓ వాహనంలో ఎక్కించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అనంతరం ఆరుగురు వైకాపా నాయకులు వారిద్దరినీ చితకబాదారు. ఆటో డ్రైవర్ రవికి ఒళ్లంతా గాయాలవ్వగా... మరో వ్యక్తి పారిపోయాడు. క్షతగాత్రుడు ప్రస్తుతం ఆదోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధితుడు వెల్లడించాడు.

ABOUT THE AUTHOR

...view details