ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రచారానికి రాలేదని వైకాపా కార్యకర్తల దాడి - ఎమ్మిగనూరు

ప్రచారానికి వెంటరావడం లేదనే అక్కసుతో వైకాపా కార్యకర్తలు గ్రామస్థుడిపై విచక్షణరహితంగా దాడి చేశారు. కర్రలతో దాడి చేసిన ఘటనలో తల్లీ కుమారులు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రచారానికి రాలేదని వైకాపా కార్యకర్తల దాడి

By

Published : Apr 8, 2019, 11:33 AM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కనకవీడులో తమ వెంట ప్రచారానికి రావడం లేదంటూ ఓ గ్రామస్థుడిపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన రంగస్వామిని ప్రచారానికి రావాలని పిలవగా అతను తిరస్కరించాడు. రెచ్చిపోయిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంటికి వెళ్లి గొడవకు దిగారు. రంగస్వామితోపాటు అతని తల్లిపై విచక్షణరహితంగా కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వారికి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ప్రచారానికి రాలేదని వైకాపా కార్యకర్తల దాడి

ABOUT THE AUTHOR

...view details