ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భర్త వేధింపులు తాళలేక.. టీచర్​ సెల్ఫీ సూసైడ్​ - sucide

నా భర్త తాగి వచ్చి నన్ను రోజూ వేధిస్తున్నాడు. అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. దయచేసి నా ముగ్గురు ఆడపిల్లల్ని నా భర్త దగ్గరకు పంపించకండి: సెల్ఫీ వీడియోలో మల్లీశ్వరి

మల్లీశ్వరీ

By

Published : Apr 22, 2019, 7:06 PM IST

సెల్ఫీ సూసైడ్

భర్త వేధింపులు భరించలేక ఓ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని వెల్దుర్తికి చెందిన మల్లీశ్వరీ బాయి, సుధాకర్ భార్యభర్తలు. వీరివురూ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. కొన్నాళ్ల నుంచి వీరి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. మద్యానికి అలవాటు పడిన సుధాకర్.. మల్లీశ్వరిని రోజూ వేధించసాగాడు. ఈ నేపథ్యంలో ఆవేదనకు గురైన మల్లీశ్వరీ భాయి ఆత్మహత్యకు పాల్పడింది. తన ముగ్గురు పిల్లలను భర్త వద్ద ఉంచవద్దని ఆత్మహత్య చేసుకునే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో కోరింది. కేశాలంకరణకు ఉపయోగించే రసాయనం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను కర్నూలు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై వెల్దుర్తి పోలీసులు కేసు నమెదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details