కర్నూలు జిల్లా నంద్యాలలోని పలు బార్ అండ్ రెస్టారెంట్లలో.. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. వాటి పరిసరాలు, వంటశాల, పాత్రలు, నిల్వ ఆహారాన్ని పరిశీలించారు. నిబంధనలు పాటించని రాజధాని, చందమామ బార్ అండ్ రెస్టారెంట్లకు.. యాభై వేల రూపాయల చొప్పున జరిమానా విధించారు. విజిలెన్స్ సీఐ నాగరాజ్ యాదవ్, ఎస్సై జయన్నతో పాటు పురపాలక సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు.
బార్ అండ్ రెస్టారెంట్లలో విజిలెన్స్ తనిఖీలు.. రూ.50 వేల జరిమానా
కర్నూలు జిల్లా నంద్యాలలోని వివిధ బార్ అండ్ రెస్టారెంట్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. నిబంధనలు పాటించని రెండింటికి రూ. 50 వేల చొప్పున జరిమానా విధించారు.
విజిలెన్స్ అధికారుల తనిఖీలు