కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో.. కుందూనదికి వరద ప్రవాహం అధికమైంది. నంద్యాల వద్ద 20 వేల కూసెక్కులకు పైగా నీరు ప్రవహిస్తోంది. నందమూరి నగర్, వైస్ నగర్, ఎస్సార్బీసి, పులిమద్ది తదితర గ్రామాలకు వెళ్లే రహదారి వంతెన పైకి... నీరు వచ్చింది. ఫలితంగా.. ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నంద్యాల హరిజనపేట వద్ద మద్దిలేరు వాగులోనూ నీటి ప్రవాహం పెరిగింది. ఇక్కడ వంతెన మునిగిపోయింది. భీమవరం గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. నీటి ఉధృతి కారణంగా... పోలీసులు వంతెన వద్ద కాపలా కాస్తున్నారు.
కుందూనదికి వరద ఉద్ధృతి.. రాకపోకలకు అంతరాయం
వరదనీరు భారీగా చేరుతున్న కారణంగా... కుందూ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నంద్యాల సమీపంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
The floodwaters have increased drastically and the flow of the kundhu river has increased.