కర్నూలు జిల్లా నంద్యాల పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో పశుసంవర్ధక సహాయకులకు కృత్రిమ గర్భోత్పత్తి పరికరాలను జిల్లా సంయుక్త సంచాలకులు డాక్టర్ రమణయ్య అందజేశారు. పశువుల వివరాలను నమోదు చేసి ఎప్పటికపుడు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, పాడి రైతుల అభివృద్ధికి పాటుపడాలని జేడీ సూచించారు. ఈ కార్యక్రమంలో పశు గణాభివృద్ది సంస్థ కార్యనిర్వహణాధికారి డాక్టర్ విజయుడు, ఉప సంచాలకులు డాక్టర్ సీవీ. రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
'పశువుల విస్తరణకు పశుసంవర్ధక శాఖ కృషి చేయాలి' - నంద్యాల వార్తలు
గ్రామాల్లో మేలైన పశువుల విస్తరణకు పశుసంవర్ధక శాఖ సహాయకులు కృషి చేయాలని పశుసంవర్ధక శాఖ కర్నూలు జిల్లా సంయుక్త సంచాలకులు డాక్టరు రమణయ్య అన్నారు.
పశువుల విస్తరణకు పశుసంవర్ధక శాఖ కృషి చేయాలి