ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరీక్షలకు అవకాశమివ్వాలని విద్యార్థి నేతల ధర్నా.. అరెస్ట్ - టీటీసీ కోర్సు మేనేజ్​మెంట్ విద్యార్థులు

డీఈడీ మేనేజ్​మెంట్ విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు అనుమతించాలంటూ కర్నూలు జిల్లా నంద్యాలలో విద్యార్థి సంఘాల నేతలు ధర్నా నిర్వహించారు. మేనేజ్​మెంట్ విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు.

పరీక్షలకు అవకాశమివ్వాలని విద్యార్థి నేతల ధర్నా.. అరెస్ట్
పరీక్షలకు అవకాశమివ్వాలని విద్యార్థి నేతల ధర్నా.. అరెస్ట్

By

Published : Nov 5, 2020, 10:06 PM IST

డీఈడీ మేనేజ్​మెంట్ విద్యార్థులకు పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని కర్నూలు జిల్లా నంద్యాలలో విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా చేశారు. స్థానిక బస్టాండు సమీపంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రం వద్ద ఆందోళన నిర్వహించారు.

మేనేజ్​మెంట్ విద్యార్థులకు న్యాయం చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details