దసరా పండుగ పూట కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. దసరా సెలవుల్లో సరదాగా తోటి పిల్లలతో ఆడుకుంటూ.. గుడేకన్ వద్ద కాల్వలోకి దిగిన ఆరో తరగతి విద్యార్థి వినోద్ గల్లంతయ్యాడు. వెంటనే గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టగా.. వినోద్ మృతదేహం లభ్యమయ్యింది. కొడుకు విగతజీవిగా మారటంతోతల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
కాలువలో పడి.. ఆరో తరగతి విద్యార్థి మృతి - కాలవలో పడి ఆరో తరగతి విద్యార్థి మృతి
సరదాగా ఆడుకుందామని స్నేహితులతో కలిసి కాలువలోకి దిగాడు. ప్రమాదవశాత్తు గల్లంతయ్యి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో చోటు చేసుకుంది.
కాలవలో పడి ఆరో తరగతి విద్యార్థి మృతి