ఇదీ చదవండి:
సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన శ్రీశైల క్షేత్రం - srisailam news
కర్నూలు జిల్లా శ్రీశైల మహాక్షేత్రం మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఆలయ పరిసరాలు విద్యుత్ కాంతులతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ ఏడు రోజుల పాటు వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలకు ఆలయ ఈవో కె.ఎస్ రామారావు... ఆదివారం అంకురార్పణ చేయనున్నారు. ఉదయం 9 గంటలకు యాగశాలలో ఉత్సవ ప్రారంభ పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన క్రతువులు నిర్వహిస్తారు. ఉత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ.. ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ధ్వజపటాన్ని ఆవిష్కరిస్తారు.
సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన శ్రీశైల క్షేత్రం