డీఆర్డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సన్మానించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరుకు చెందిన సతీష్... మాతృమూర్తి రంగమ్మ అస్థికలను కృష్ణా నదిలో కలపేందుకు విజయవాడ వెళ్లారు. ఈ క్రమంలో సీఎం జగన్‌ను ... సతీష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కృష్ణా జిల్లా నాగాయలంక క్షిపణి పరీక్ష కేంద్రానికి సంబంధించిన భూమి, ఇతర అనుమతులతోపాటు రాష్ట్రంలోని రక్షణ రంగ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రితో ఆయన చర్చించారు. నిమ్మకూరు వద్ద బెల్ పనులు మొదలయ్యాయని... అనంతపురం జిల్లా లేపాక్షి బెల్ ప్రాజెక్టుకు భూమి సమస్యలు తీరాయని... కర్నూలు జిల్లాకు మంజూరైన ప్రాజెక్టు పనులు మొదలు కాబోతున్నాయని సతీష్‌రెడ్డి తెలిపారు. అనుమతులు వచ్చిన కొన్ని ప్రాజెక్టులను త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నామని డీఆర్డీవో ఛైర్మన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: