ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్పందన: గాజులదిన్నె జలాశయం లీకేజీని పరిశీలించిన ఎస్​ఈ శ్రీరామచంద్రమూర్తి - గాజులదిన్నె జలాశయాన్ని పరిశీలించిన ఎస్​ఈ

కర్నూలు జిల్లా గాజులదిన్నె జలాశయాన్ని జలవనరుల శాఖ ఎస్​ఈ శ్రీరామచంద్రమూర్తి పరిశీలించారు. జలాశయం లీకేజీపై 'ఈటీవీ - భారత్'​లో వచ్చిన కథనానికి స్పందించారు. ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా నీరు ఉందని.. అందుకే లీకేజీ అవుతుందని చెప్పారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

se visit gajuladinne reservoir
గాజులదిన్నె జలాశయం లీకేజీని పరిశీలించిన ఎస్​ఈ శ్రీరామచంద్రమూర్తి

By

Published : Dec 10, 2020, 12:22 PM IST

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె జలాశయం లీకేజీపై ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్​లలో వచ్చిన కథనానికి స్పందన లభించింది. జలవనరుల శాఖ ఎస్ఈ శ్రీరామచంద్రమూర్తి జలాశయాన్ని పరిశీలించారు. 4 టీఎంసీల కంటే ఎక్కువగా నీరు నిల్వ ఉంచినందున సీపేజ్ నీరు ఎక్కువగా వెళ్తుందని ఎస్​ఈ తెలిపారు. ప్రస్తుత నీటి నిల్వ 4.4 టీఎంసీలు ఉండగా గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జలాశయానికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details