కర్నూలు జిల్లా నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామం ఆదర్శ గ్రామాల్లో ఒకటి. గతంలో తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించాలని తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవటంతో.. ఊళ్ళో ప్రభుత్వ పాఠశాల నిరాదరణకు గురైంది. విద్యార్థులతో నిండుగా ఉండాల్సిన పాఠశాల వెలవెలపోయింది. దీంతో 2014-15 విద్యా సంవత్సరంలో పాఠశాలను అధికారులు మూసివేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకం ప్రవేశపెట్టడం వల్ల పాఠశాలను తెరవాలని గ్రామస్తులు అధికారులకు విన్నవించారు. పాఠశాలను తామే అభివృద్ధి చేసుకుంటామని తెలిపారు.
అమ్మఒడి వచ్చింది.. పాఠశాల తెరవండి
అమ్మ ఒడి పథకంతో రాష్ట్రంలో మూతపడ్డ ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుంది. గతంలో పిల్లలను పాఠశాలకు పంపించని తల్లిదండ్రులు ఇప్పుడు అమ్మఒడి రానుండటంతో మూసిన పాఠశాలను తెరవాలని కోరుతున్నారు. పాఠశాలను తామే అభివృద్ధి చేసుకుంటామంటున్నారు.
అమ్మఒడి వచ్చింది.. పాఠశాల తెరవండి
ఇదీ చదవండి: టాయిలెట్‌కు వెళ్లాలంటే.. తరగతి ఎగ్గొట్టాల్సిందే!
TAGGED:
అమ్మఒడి