ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"కోట" నీదా-నాదా..?

ఎన్నికల కురుక్షేత్రానికి ఢంకా మోగకముందే కర్నూలు జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. ఈ నియోజకవర్గంలో ఎవరు పాగా వేస్తారు..? ఏ పార్టీ జెండా రెపరెపలాడుతుంది..? తెదేపాలో కోట్ల చేరితే ఆయన్ని ఎదుర్కొనేది ఎవరు... ప్రతిపక్ష పార్టీ వ్యూహాలమేంటి వంటి విషయాలే ప్రస్తుతం ఉత్కంఠను రేపుతున్నాయి.

వేడెక్కుతున్న కర్నూలు రాజకీయం

By

Published : Feb 16, 2019, 6:12 AM IST

కర్నూలు పార్లమెంట్ ...గత కొన్ని రోజులుగా జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఎవరు పాగా వేస్తారు..? ఏ పార్టీ జెండా రెపరెపలాడుతుంది..? తెదేపాలో కోట్ల చేరితే ఆయన్ని ఎదుర్కొనేది ఎవరు... ప్రతిపక్ష పార్టీ వ్యూహాలమేంటి. ప్రస్తుతం ఎంపీగా ఉన్న బుట్టా రేణుక పరిస్థితేంటి..?వంటి విషయాలే కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి.
వేడెక్కిన రాజకీయం...
ఎన్నికల కురుక్షేత్రానికి ఢంకా మోగకముందే కర్నూలు జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. రాష్ట్ర విభజన అనంతరం క్రియాశీలకంగా లేని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి... ఈ ఎన్నికలకు ముందే పక్కాగా అడుగులు వేస్తున్నారు. కిందటి ఎన్నికల్లో కర్నూలు లోక్​సభ స్థానం నుంచి పోటీ చేసిన కోట్ల మూడోస్థానంలో నిలిచారు. రాజకీయ పరిణామాల దృష్ట్యా సైకిల్ ఎక్కేందుకు రంగం సిద్ధమయ్యారు. చేరికపై ఇప్పటి వరకు ఎక్కడ స్పష్టత ఇవ్వకున్నా కండువా మార్చుకోవడం ఖాయమనిపిస్తోంది. జిల్లాలో కోట్ల కుటుంబానికి మంచి పేరు బలమైన క్యాడర్ ఉంది. అలాంటి ఆయన తెదేపా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే తిరుగుండదని తెలుగు తమ్ముళ్లు ధీమ.
కలయికతో తర్జనభర్జన...
సైకిల్‌ తరఫున కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా కోట్ల బరిలోకి దిగితే... దీటైన వ్యక్తిని బరిలోకి దింపాలని వైకాపా భావిస్తోంది. ఈ టిక్కెట్‌ బీసీ అభ్యర్థికి ఇస్తామని జగన్ ఇప్పటికే ప్రకటించారు. వాల్మీకి ఓట్లు ఎక్కువగా ఉన్న కర్నూలు జిల్లాలో అదే సామాజిక వర్గానికి సీటు కేటాయిస్తే ఎలా ఉంటుంది అనే విషయమై కసరత్తు చేస్తోంది. కోట్లను ఢీకొట్టడం సులవైన విషయం కాదని భావిస్తున్న వైకాపా... కేవలం సామాజిక కోణంలోనే కాకుండా ఆర్థిక స్థితిమంతుల కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ప్రస్తుతం వైకాపా కర్నూలు పార్లమెంట్ నియోజవర్గ ఇంఛార్జిగా ఉన్న బీవై రామయ్య టిక్కెట్ ఆశిస్తున్నారు.

వేడెక్కుతున్న కర్నూలు రాజకీయం

బలమైన అభ్యర్థి దిశగా...
బుట్టా రేణుక....కిందటి ఎన్నికల్లో కర్నూలు లోక్​సభ నుంచి వైకాపా అభ్యర్థిగా విజయం సాధించారు. అప్పట్లో ఆమె రాజకీయాలకు కొత్తైనా...కార్యకర్తలు, నాయకులు ఒకేతాటిపైకి వచ్చి సమష్ఠిగా పనిచేసి ఆమెను గెలిపించారు. అనంతరం ఆమె తెలుగుదేశంలో చేరారు. ప్రస్తుతం మారుతున్న పరిస్థితులతో ఆమెకు టిక్కెట్ దక్కదనే వార్తలు వినిపిస్తున్నాయి. కోట్ల- కేఈ కుటుంబాలు కలిసి పనిచేస్తే జిల్లాలో సైకిల్ బలం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ నియోజకవర్గంపై జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కర్నూలులోని ఆయుష్మాన్ ఆసుపత్రి అధినేత, వైద్యుడు సంజీవ కుమార్ సైతం... వైకాపా టిక్కెట్ ఆశిస్తున్నారు.
అభ్యర్థిని త్వరగా తేల్చేస్తే... క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు సమయం దొరుకుతుందని వైకాపా నేతలు భావిస్తున్నారు. మరో వారం, పది రోజుల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details