దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నేపథ్యంలో.. కర్నూలు జిల్లా ఆదోనిలో ఆర్టీసీ బస్సులను వామపక్ష నాయకులు అడ్డుకున్నారు. తెల్లవారుజాము నుంచే డిపోల వద్ద ఆందోళనకు దిగారు. ఎమ్మిగనూరులో ఎన్ఆర్సీని రద్దు చేయాలని వామపక్ష, ముస్లింలు బంద్ చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్ బయట రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. ఆర్టీసీ బస్సులు డిపోకు పరిమితమయ్యాయి. నందికొట్కూరు పట్టణంలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ధర్నా చేశారు. దుకాణదారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి ధర్నాకు మద్దతు తెలిపారు. బనగానపల్లెలో సమ్మె విజయవంతమైంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు.
భారత్ బంద్ : జిల్లావ్యాప్తంగా 'సార్వత్రిక సమ్మె' ప్రశాంతం - central government issues
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాలు పిలుపునిచ్చిన దేశవ్యాప్త బంద్... కర్నూలు జిల్లాలో ప్రశాంతగా జరిగింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తూ..కర్నూలులో నిరసన ర్యాలీ