ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ARREST: మర్డర్ కేసులో నిందితులైన భార్యాభర్తలు అరెస్ట్ - crime news

కర్నూలు జిల్లా సొగనూరులో జయరామిరెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులైన భార్యాభర్తలను అరెస్ట్ చేశారు.

ARREST
ARREST

By

Published : Aug 29, 2021, 10:45 PM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని సొగనూరులో జయరామిరెడ్డి అనే వ్యక్తి హత్య కేసులో నిందితులైన పింజరి మహమ్మద్ అనీఫ్, పింజరి సుల్తాన్ బీ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల జయరామిరెడ్డి భార్య రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉండగా అనీఫ్ మద్యం మత్తులో అసభ్యకరంగా ప్రవర్తించాడు.

మరుసటి రోజు అనీఫ్ ఇంటికి జయరామిరెడ్డి కుమారుడు వెళ్లి నిలదీయడంతో గొడవ జరిగింది. అనంతరం తన భార్యపై అనీఫ్ భార్య దాడి చేయగా.. అడ్డుకోబోయిన జయరామిరెడ్డిని హనీఫ్ బండరాయితో మోది హత్య చేశాడు. ఈ వివరాలను గ్రామీణ సీఐ మంజునాథ్, ఎసై సునీల్ కుమార్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details