ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 1, 2020, 7:06 AM IST

ETV Bharat / state

మాటువేసిన ముఠా.. మూసేసిన పోలీసులు

వ్యక్తిని హత్య చేసేందుకు కుట్ర పన్ని, మాటు వేసిన ముఠాను కర్నూలు జిల్లా పోలీసులు ఆరెస్ట్ చేశారు. వారి నుంచి నాలుగు వేట కొడవళ్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెంకట్రామయ్య తెలిపారు.

Police arrested a gang
హత్యకు కుట్ర పన్నిన ముఠా అరెస్టు

గ్రామంలో అధిపత్యం కోసం ఓ వ్యక్తిని హత్యచేసేందుకు కుట్ర పన్నిన ముఠాను కర్నూలు తాలూకా పోలీసులు అరెస్టు చేశారు. రుద్రవరం గ్రామంలో కురువ రాముడి కుటుంబానికి, బోయ విక్రమ్ కుటుంబానికి మధ్య ఎన్నాళ్ల నుంచో ఫ్యాక్షన్ గొడవులు ఉన్నాయి. ఈనేపథ్యంలో 2016లో కురువ రాముడిని బోయ విక్రమ్ కుటుంబ సభ్యులు హత్య చేశారు. ఈ హత్యకు ప్రతీకారంగా 2017లో కురువ రాముడు కొడుకు కురువ వెంకటేష్.. బోయ విక్రమ్​ను చంపారు. ఈకేసులో వెంకటేష్ అరెస్టై, బెయిల్ పై బయటికి వచ్చాడు. తనను చంపుతాడనే భయంతో విక్రమ్ ఊరి నుంచి బయటికి వెళ్లి దూరంగా జీవిస్తున్నాడు.

ఇలా భయపడి ఎన్ని రోజులుంటాం.. వెంకటేష్​నే చంపేస్తే భయం పోతుందని భావించాడు. స్నేహితులతో కలిసి పథకం రచించారు. ఈ క్రమంలో వెంకన్న బావి వద్ద కాపుకాసి ఉన్న వీరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి నాలుగు వేట కొడవళ్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెంకట్రామయ్య తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.

ఇవీ చూడండి...

వరద తగ్గినా వీడని ముంపు...భారీగా పంటనష్టం

ABOUT THE AUTHOR

...view details