కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో వీరభద్ర స్వామి, కాళికాదేవిల వివాహ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సాంప్రదాయ క్రీడ పిడకల సమరం ఆకట్టుకుంది. ముందుగా కారుమంచి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి వంశీకులు గుర్రంపై ఊరేగింపుగా వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పిడకల యుద్ధం ఆరంభమైంది. కైరుప్పల, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రెండుగా విడిపోయి ఒకరి మీద ఒకరు పిడకలు విసురుకున్నారు. శతాబ్దాల నుంచి ఈ తంతు జరుగుతుందని... ఆనవాయితీగా ఏటా జరిపిస్తామని ఆలయ పూజారి తెలిపారు. ఈ వేడుక తిలకించేందుకు వేలమంది తరలివచ్చారు. మహిళలు సైతం అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సంబరంలో పిడకలు తగిలి కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి.
వివాహ వేడుకలో ఘనంగా 'పిడకల' సమరం - కర్నూలు
ఎప్పుడైనా పిడకలతో కొట్టుకున్నారా... పిడకలతో కొట్టుకోవడమేంటని ఆశ్చర్యపోకండీ... వినడానికి చమత్కారంగానే ఉన్నా... ఓ ప్రాంతంలో ఇదొక సంప్రదాయం. వారు ఎంతో నమ్మకంతో కొలిచే దేవుని వివాహం రోజే ఈ తంతు జరుగుతుంది.
వీరభద్రస్వామి పెళ్లి వేడుకలో 'పిడకల' ఉత్సవం