కర్నూలు జిల్లాలో 3,800 హెక్టార్లలో ఉల్లి సాగు చేశారు. దిగుబడులు బాగానే వచ్చిన క్వింటా ధర ఐదు వందలు కూడా పలకడం లేదు. ఉల్లి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా ఎమ్మిగనూరు,డోన్,పత్తికొండ, కోడుమూరు, నందికొట్కూరు మార్కెట్లలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉల్లి క్వింటా 770 రూపాయలకు కొనుగోలు చేస్తుంది.
'ఎమ్మిగనూరులో నిలిచిన ఉల్లి కొనుగోళ్లు' - ఎమ్మిగనూరులో నిలిచిన ఉల్లి కొనుగోళ్లు'
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉల్లి కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి ఉల్లిని కొనుగోలు చేయటం లేదు. కేంద్రానికి విక్రయానికి తెచ్చిన రైతులు పడిగాపులు కాస్తున్నారు. నాణ్యత పేరుతో ఉల్లిని కొనుగోలు చేయకపోవటం దారుణమన్నారు.
'ఎమ్మిగనూరులో నిలిచిన ఉల్లి కొనుగోళ్లు'
కానీ కేంద్రంలో ఉల్లిని కొనుగోలు చేయటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఎకరానికి 50వేలకు పైగా పెట్టుబడులు పెట్టి సాగుచేస్తే నష్టాలు చవిచూడాల్సి వస్తుందని వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత పేరుతో ఉల్లిని కొనుగోలు చేయకపోవటం దారుణమన్నారు.