ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 15, 2021, 8:55 PM IST

ETV Bharat / state

నాపై వస్తున్న ప్రచారాల్లో వాస్తవం లేదు: ఎంపీ గోరంట్ల మాధవ్

తెదేపా మద్దతుదారుడిని సర్పంచి ఎన్నికల్లో గెలిపించానని సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్​ అన్నారు. ఇలాంటి దుష్ప్రచారాలకు అడ్డుకట్ట వేసేందుకే గెలిచిన వ్యక్తితో పాటు మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

mp gorantla madhav
ఎంపీ గోరంట్ల మాధవ్

పంచాయతీ ఎన్నికల్లో తెదేపా మద్దతుదారుడిని సర్పంచిగా గెలిపించానని సాగుతున్న ప్రచారం అవాస్తవమని వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్​ అన్నారు. కర్నూలులోని పి.రుద్రవరం తన స్వగ్రామమని.. ఆ ఊరిలో నలుగురు అభ్యర్థులు వైకాపా తరఫున పోటీ చేసేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. గ్రామస్థులందరి సమక్షంలో చర్చించి.. మధు అనే వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని పేర్కొన్నారు. సోషల్​ మీడియా, పలు పత్రికలు, టీవీ ఛానల్స్​లో తప్పుడు ప్రచారాలు జరిగాయన్నారు. వాటన్నిటికీ సమాధానంగా సర్పంచి అభ్యర్థిగా గెలిచిన మధుతో పాటు ప్రెస్​మీట్​ ఏర్పాటు చేసినట్లు మాధవ్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details