ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శ్రీశైల క్షేత్రంలో.. అన్యమతస్తులను బహిష్కరించాలి: రాజాసింగ్

By

Published : Aug 17, 2021, 11:30 AM IST

శ్రీశైల పుణ్య క్షేత్రం అన్యమతస్తులకు అడ్డాగా మారిందని తెలంగాణకు చెందిన గోషామహల్ ఎమ్మెల్యే, భాజపా నేత రాజాసింగ్ ఆరోపించారు. శ్రీశైలంలో అన్యమతస్తులను నిలువరించేందుకు నంద్యాల పార్లమెంటరీ భాజపా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి చేపట్టే పోరాటానికి సహాయ, సహకారాలు అందివ్వనున్నట్లు ఆయన చెప్పారు.

mla-rajasingh-on-srisailam
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

శ్రీశైల పుణ్య క్షేత్రంలోని అన్యమతస్తులను భహిష్కరించాలి

శ్రీశైల పుణ్య క్షేత్రం అన్యమతస్తులకు అడ్డాగా మారిందని తెలంగాణకు చెందిన భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. శ్రీశైలంలో అన్యమతస్తులను నిలువరించడం కోసం నంద్యాల పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి చేపడుతున్న పోరాటానికి పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని రాజాసింగ్​ చెప్పారు.

శ్రీశైలంలోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో అన్యమతస్తులను బయటకు పంపడానికి ఏపీ భాజపా పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తోందని.. దేశం మొత్తం హిందుత్వంతో వర్ధిల్లాలని రాజాసింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details