కర్నూలులో వరంగల్లాంటి ఘటన! - వరంగల్
తెలంగాణలోని వరంగల్లో చిన్నారిపై అత్యాచార ఘటన మరవకముందే..కర్నూలులో మరో పైశాచిక పర్వం బయటపడింది. మనవరాళ్లతో ఆడుకోవాల్సిన వయసులో...మగబుద్ధితో దారుణానికి ప్రయత్నించాడో రిటైర్డ్ ఉద్యోగి.
కర్నూలు పట్టణంలోని రైల్వే త్రివర్ణ కాలనీ. ఇద్దరు చిన్నారుల(7) దగ్గరకు వచ్చాడు రాందాస్(70). తాత వయసుంది కాదా? అన్నట్లుగా మాట్లాడారు చిన్నారులు. వారికి మాయమాటలు చెప్పి.. కాలనీకి దగ్గరలో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే క్వార్టర్స్ దగ్గరకు తీసుకెళ్లాడు. ఏదో పని చెప్తాడు తాత అనుకున్నారు పిల్లలు. ఒక్కసారిగా మృగంలా అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారులు అరుపులు, కేకలు వేశారు. వినిపించిన స్థానికులు వెళ్లి చూడగా..రాందాస్ బాగోతం బయటపడింది. చంపేస్తారనే భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. చిన్నారుల తల్లిదండ్రులు డోన్ పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.