మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని..ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రజలను కోరారు. కర్నూలు పాత నగరంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. గత సాధారణ ఎన్నికల్లో సీఎం జగన్ తమ మద్దతు తీసుకున్నారని..కానీ ప్రస్తుతం ఎన్నికల ప్రచారానికి అనుమతి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదోనిలో ప్రచారానికి వెళితే అక్కడ కూడా అనుమతి లేదన్నారని ఆరోపించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం జరుగుతున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు.