కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి.. వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులకు విధులు వేయడం ఏంటని మండిపడ్డారు.
జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అధికార పార్టీ నాయకుల దాడులు అధికమయ్యాయన్నారు. మద్యం దుకాణాలను వెంటనే మూసేయాలని డిమాండ్ చేశారు.