రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ అన్నారు. నగరంలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లోకల్ లెవల్ కమిటీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాయలసీమకు హైకోర్టుతో పాటు రాష్ట్రస్థాయి కార్యాలయాలు రావాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిని మహాత్మాగాంధీతో పోల్చారు.
దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎంపీ సంజీవ్‌కుమార్ - కర్నూలులో లోకల్ లెవెల్ కమిటీ కార్యాలయం ప్రారంభం
కర్నూలు నగరంలో దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన లోకల్ లెవల్ కమిటీ కార్యాలయాన్ని ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ప్రారంభించారు. సీఎం చేస్తున్న కార్యక్రమాలు పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ.. ముఖ్యమంత్రిని మహాత్మాగాంధీతో పోల్చారు.

కర్నూలులో.. లోకల్ లెవెల్ కమిటీ కార్యాలయం ప్రారంభం