రాజకీయంగా ఎదుర్కొనలేక... తనపై తప్పడు కేసులు బనాయిస్తున్నారని కర్నూలు జిల్లా తెదేపా నాయకుడు డి.విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు. గత నెలలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో కోడుమూరు నియోజకవర్గ బాధ్యుడు విష్ణువర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసి సబ్జైల్కు తరలించారు. ఇవాళ బెయిల్ లభించటంతో ఇంటికి వచ్చారు. తమ అభిమాన నేతను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తాను దళితులకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు రుజువు చేస్తే.. సొంతూరుకు వెళ్లనని విష్ణు ప్రకటించారు. అధికారం ఉందని తప్పుడు కేసులు పెట్టడం సరికాదని.... కేసులు పెట్టే ముందు నిజ నిర్ధరణ చేసుకోవాలని హితవు పలికారు.
'దళిత వ్యతిరేకి అని రుజువు చేస్తే.. సొంతూరు వెళ్లను' - TDP
దళితులకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు రుజువు చేస్తే తన సొంతూరుకు వెళ్లనని కర్నూలు జిల్లా తెదేపా నేత విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.
దళిత వ్యతిరేకి అని రుజువు చేస్తే.. సొంతూరుకు వెళ్లను'