ధరల స్థిరీకరణకు ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందేనని నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన కిసాన్ మేళాను ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. రాబోయే రోజుల్లో రైతులకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. ఉల్లి ధర పెరిగితే అందరూ ఆందోళన చెందడం సరి కాదని, రైతులకు మంచి ధర దక్కిందని ఆనందపడలని తెలిపారు. కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఎంపీ పేర్కొన్నారు. జిల్లాను సీడ్ హబ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి అన్నారు.
'భవిష్యత్ లో రైతులకు మేలు జరుగుతుంది'
భవిష్యత్ లో రైతులకు మేలు ఎంతో మేలు జరుగుతుందని కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి అన్నారు. నంద్యాలలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళాలోని పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై వాటిని ప్రారంభించారు.
కర్నూలులో ఘనంగా కిసాన్ మేళా