కర్నూలు జిల్లాలోని అన్నిస్థానాల్లో తెదేపా జెండా రెపరెపలాడటం ఖాయమని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. తెదేపా గూటికి చేరిన కోట్ల కుటుంబానికి కోడుమూరు సభలో కేఈ స్వాగతం పలికారు.
కర్నూలు
By
Published : Mar 2, 2019, 6:23 PM IST
కోడుమూరు సభలో కేఈ
రాబోయే ఎన్నికల్లో కర్నూలుజిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో తెదేపా జెండా రెపరెపలాడటం ఖాయమని ఉప ముఖ్యమంత్రికేఈ కృష్ణమూర్తి దీమా వ్యక్తం చేశారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు ముఖ్యమంత్రికంకణం కట్టుకున్నారని చెప్పారు. చంద్రబాబు అపర భగీరథునిగా మారి నదుల అనుసంధానం చేపట్టారని కితాబిచ్చారు. డ్వాక్రా మహిళలకు పసుపుకుంకుమ కింద ప్రభుత్వం ఆర్థిక సాయం చేసిందని.. త్వరలోనే వారికి స్మార్ట్ ఫోన్లు కూడా ఇస్తామని తెలిపారు. పార్టీకి బీసీలే పెద్ద అండఅన్నారు.