ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైదరాబాద్​లో కర్నూలు రైతుల నిరసన

ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు చేసి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా కంపెనీ యాజమాన్యం ముఖం చాటేసింది. న్యాయం చేయాలని ఆశ్రయించిన పోలీసులు పట్టించుకోవడం లేదు. ఎలాగైనా తమ కష్టార్జితం రాబట్టుకునేందుకు కర్నూలు నుంచి పలువురు రైతులు హైదరాబాద్​కు వచ్చి నిరసనకు దిగారు.

karnool-farmers-protest
హైదరాబాద్​లో కర్నూలు రైతుల నిరసన

By

Published : Feb 26, 2020, 10:48 AM IST

హైదరాబాద్​లో కర్నూలు రైతుల నిరసన

కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన రైతుల దగ్గర నాలుగేళ్ల క్రితం ఎస్​ఎన్​ఎస్​ కంపెనీ మొక్కజొన్న పంట కొనుగోలు చేసింది. కానీ ఇంత వరకు డబ్బులు మాత్రం చెల్లించలేదు. అప్పటి నుంచి కంపెనీ యాజమాన్యం దాటవేస్తూ వచ్చింది. దీనిపై​ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించకుండా ముఖం చాటేసిన యాజమాన్యం తీరుకు నిరసనగా రైతులు ఆందోళన బాట పట్టారు. 20 మంది రాత్రి కర్నూలు నుంచి హైదరాబాద్​కు వచ్చి వ్యాపారి జిలాని ఇంటి ఎదుట వంటావార్పుతో నిరసన తెలిపారు. తమకు రావాల్సిన రూ.80 లక్షలు చెల్లించే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. దీనిపై మీడియా వివరణ కోరగా కంపెనీ ఉద్యోగి నిర్లక్ష్యపు సమాధానంతో దాటవేశారు.

ABOUT THE AUTHOR

...view details